- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిరిండియా ప్రమాదం.. పరిహారం ఇచ్చేందుకు సంస్థ ఆ డిమాండ్స్ చేస్తోందా ?
by Naga Rani Yarlagadda |
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గత నెలలో జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది సహా మొత్తం 274 మంది మరణించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గత నెలలో జరిగిన ఎయిరిండియా (Ahmedabad Air india Crash) ప్రమాదంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది సహా మొత్తం 274 మంది మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఇండియన్స్ తో పాటు.. ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎయిరిండియా యాజమాన్యం తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తుంది. అయితే పరిహారం పొందాలంటే బాధిత కుటుంబాలు ఆర్థిక వివరాలను వెల్లడించాలని ఎయిరిండియా ఒత్తిడి చేస్తోందని బ్రిటన్ కు చెందిన స్టీవర్ట్స్ అనే న్యాయసంస్థ ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించిన ఎయిరిండియా.. ఎందులో ఏ మాత్రం నిజం లేదని పేర్కొంటూ.. ఆరోపణలను ఖండించింది. పరిహారాన్ని అందించేందుకు కొన్ని విధానాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని, అందుకు బాధిత కుటుంబాలకు కావలసినంత సమయం కూడా ఇస్తున్నట్లు వెల్లడించింది.
Next Story






