Air India Crash: ఏడేళ్ల క్రితమే ఫ్యూయల్ స్విచ్‌లపై అమెరికా వార్నింగ్!

by Phanindra |

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి ఫ్యూయల్ స్విచ్‌లే కారణం కావొచ్చని రిపోర్టులు చెప్తున్నాయి. ఏడేళ్ల క్రితమే ఈ విషయంలో అమెరికా హెచ్చరికలు చేయడం గమనార్హం.

Air India Crash: ఏడేళ్ల క్రితమే ఫ్యూయల్ స్విచ్‌లపై అమెరికా వార్నింగ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ అవడం కారణం అయ్యుండొచ్చని రిపోర్టులు చెప్తున్నాయి. ఈ క్రమంలో 2018 డిసెంబరులో యూఎస్‌ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఇచ్చిన రిపోర్టు కలకలం రేపుతోంది. ఈ రిపోర్టులో కొన్ని బోయింగ్ 737 విమానాల్లో ఉన్న ఫ్యూయల్ స్విచ్‌లు సరిగా పనిచేయడం లేదని, ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతున్నాయని ఎఫ్ఏఏ హెచ్చరించింది.

ఆ విమానాల్లో ఉపయోగించే స్విచ్‌లనే బోయింగ్ 787-8లో కూడా ఆ కంపెనీ వాడుతోంది. అహ్మదాబాద్‌లో కూలిన విమానం ఈ మోడల్‌దే కావడం గమనార్హం. ఈ ఫ్యూయల్ స్విచ్‌ల గురించి ఏడేళ్ల క్రితమే వార్నింగ్ ఇచ్చిన ఎఫ్ఏఏ.. కొన్ని సూచనలు చేసింది. విమానాల్లో ఈ స్విచ్‌లు చెక్ చేసుకోవాలని, కొత్త మోడల్ స్విచ్‌లను వాడాలని సూచించింది. ఇవి కేవలం మార్గదర్శకాలే కానీ తప్పనిసరి అని చెప్పలేదు. ఈ క్రమంలోనే ఎయిరిండియా ఈ రిపోర్టులో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించలేదని తెలుస్తోంది.

Next Story