Plane Crash: మృతుల కుటుంబాలకు ఎయిరిండియా ఎక్స్‌గ్రేషియా

by Gantepaka Srikanth |

అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ఎయిరిండియా(Air India) పరిహారం ప్రకటించింది.

Plane Crash: మృతుల కుటుంబాలకు ఎయిరిండియా ఎక్స్‌గ్రేషియా
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ఎయిరిండియా(Air India) పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేసింది. టాటా కంపెనీ ప్రకటించిన రూ.కోటి రూపాయలతో పాటు అదనంగా మరో రూ.25 లక్షలు ఇస్తామని పేర్కొంది. అంతేగాకుండా.. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తామని ఇప్పటికే తెలిపింది. ఈ మేరకు టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటన సైతం విడుదల చేశారు. ‘ఎయిరిండియా ప్రమాద ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆ బాధను వ్యక్తపరచడానికి మాటలు కూడా రావడం లేదు. ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే బీజే మెడికల్‌ హాస్టల్ నిర్మాణానికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు.

Next Story