- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే రోజు 9 ఎయిరిండియా విమానాలు రద్దు.. కారణం ఏంటంటే?
ఒకే రోజు 9 ఎయిరిండియా విమానాలు రద్దు అయ్యాయి. వీటిలో నాలుగు అంతర్జాతీయ విమానాలు కాగా, ఐదు డొమెస్టిక్ విమానాలు.

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత మెయింటెనెన్స్, ఆపరేషనల్ పరీక్షలను ఈ కంపెనీ పెంచేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి పూణే వెళ్లే ఒక విమానానికి ఒక పక్షి తగలడంతో ఏకంగా ఆ విమానాన్ని రద్దు చేసింది. పూణేలో విమానం ల్యాండవగానే దానికి పక్షి తగిలినట్లు గుర్తించామని, దాంతో అప్రమత్తమైన ఇంజినీరింగ్ బృందం విమానాన్ని పరిశీలించిందని ఎయిరిండియా తెలిపింది. దీంతోపాటు మరో 8 ఎయిరిండియా విమానాలు కూడా రద్దవడం గమనార్హం. వీటిలో నాలుగు అంతర్జాతీయ విమానాలు. మెయింటెనెన్స్, ఆపరేషనల్ కారణాల వల్లనే ఈ విమానాలు రద్దయినట్లు ఎయిరిండియా చెప్తోంది.
డొమెస్టిక్ విమానాల్లో ఏఐ874 పూణే టు ఢిల్లీ, ఏఐ456 అహ్మదాబాద్ టు ఢిల్లీ, ఏఐ2872 హైదరాబాద్ టు ముంబై, ఏఐ571 చెన్నయ్ టు ముంబై రద్దయ్యాయి. అదే సమయంలో అంతర్జాతీయంగా ఏఐ906 దుబాయ్ టు చెన్నయ్, ఏఐ308 ఢిల్లీ టు మెల్‌బోర్న్, ఏఐ309 మెల్‌బోర్న్ టు ఢిల్లీ, ఏఐ2204 దుబాయ్ టు హైదరాబాద్ విమానాలను కూడా ఎయిరిండియా రద్దు చేసింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. కాగా, జూన్ 21 నుంచి జులై 15 వరకు అంతర్జాతీయ విమానాలను తగ్గిస్తామని ఎయిరిండియా ప్రకటించింది. అలాగే మూడు అంతర్జాతీయ మార్గాల్లో విమానాలు రద్దు చేస్తామని తెలిపింది. మొత్తమ్మీద వారానికి 38 అంతర్జాతీయ విమానాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.






