- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిరిండియా AI-171 ప్రమాద దర్యాప్తు.. AAIB మరో కీలక నిర్ణయం
ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాద దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలకు శోకసంద్రంతో ముంచిన ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు తుది నివేదిక (Final Report) వెల్లడి కావడానికి మరో2 నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై అత్యంత లోతుగా విచారణ జరుపుతోంది. అయితే, దర్యాప్తులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఒక తాత్కాలిక స్టేటస్ రిపోర్ట్‌ను విడుదల చేయాలని AAIB భావిస్తున్నట్లుగా సమాచారం. ఫ్లైట్ యాక్సిడెంట్‌కు కారణమైన టెక్నికల్ సమస్యలు, వాతావరణ పరిస్థితులు,పైలట్ల నిర్ణయాలపై AAIB నిపుణుల బృందం చాలా డేటాను సేకరించింది. విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ నుండి సేకరించిన కీలకమైన డేటాను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు గాను తక్కవలో తక్కువ మరో 60 రోజుల సమయం పడుతుందని AAIB అధికారులు అంచనా వేస్తున్నారు.






