- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో ఎయిర్ ఎమర్జేన్సీ.. స్కూళ్లలో హైబ్రిడ్ మోడ్‌లో తరగతులు
జాతీయ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి అత్యంత ప్రమాదకరమైన(Severe) స్థాయికి చేరుకుంది.ఈ నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి అత్యంత ప్రమాదకరమైన(Severe) స్థాయికి చేరుకుంది.ఈ నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం గ్రాప్-4 చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ఆదేశాలకు అనుగుణంగా, ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ (DoE) అన్ని పాఠశాలల్లో (ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్.డి.ఎం.సి, ఎం.సి.డి పాఠశాలలతో సహా) 9వ తరగతి వరకు, 11వ తరగతి విద్యార్థులకు తక్షణమే హైబ్రిడ్ మోడ్‌లో తరగతులు నిర్వహించాలని సర్క్యులర్ జారీ చేసింది.
ఆన్‌లైన్ లేదా ఫిజికల్ మోడ్‌లో తరగతుల నిర్వహణ
సీఏక్యూఎం జారీ చేసిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లోని స్టేజ్-IV ఆదేశాల మేరకు, ఈ ఆదేశాలు అమలు లోకి వచ్చాయి. దీని ప్రకారం, పాఠశాలలు తరగతులను భౌతికంగా (Physical) మరియు ఆన్‌లైన్‌లో (Online) (ఆన్‌లైన్ విధానం సాధ్యమైన చోట) రెండింటిలోనూ నిర్వహించాలి. అయితే, ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే ఎంపికను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకే విడిచిపెట్టాలని DoE ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ హైబ్రిడ్ పద్ధతి కొనసాగుతుందని, ఈ తీవ్ర కాలుష్య సమయంలో విద్యార్థులు భౌతిక తరగతులకు హాజరు కావడానికి బలవంతం చేయకూడదని విద్యా శాఖ నొక్కి చెప్పింది. ఈ ఏర్పాట్ల గురించి వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కోరారు.






