- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gig workers: డెలివరీ బాయ్స్ కోసం.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం
గిగ్ వర్కర్ల (డెలివరి బాయ్స్) కోసం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: గిగ్ వర్కర్ల (డెలివరి బాయ్స్) కోసం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆహారం, ఇ-కామర్స్ డెలివరీలలో పాల్గొనే (gig workers) గిగ్ వర్కర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు (Chennai Corporation) నిర్ణయం తీసుకుంది. నగరంలోని ముఖ్యమైన రహదారుల వెంట ఎయిర్ కండిషన్డ్ షెల్టర్‌లు తీసుకురానుంది. రోడ్డు భద్రత, ఆర్డర్స్ రానిసమయంలో సురక్షితమైన ప్రదేశంలో డెలివరీ బాయ్స్ ఉండేందుకు వీలుగా, డెలివరీ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహించడానికి కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు దుబాయ్ మోడల్ నుంచి ప్రేరణగా పొందింది. అక్కడ గిగ్ వర్కర్ల కోసం విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే గిగ్ కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీసీసీ ఇంజనీర్లు విశ్రాంతి ప్రాంతాలను నిర్మిస్తున్నారని ఓ అధికారి పేర్కొన్నారు. మహిళా కార్మికుల కోసం టాయిలెట్స్ సైతం నిర్మించనున్నట్లు వెల్లడించారు.
మొదట చెన్నైలోని అన్నా నగర్, నుంగంబాక్కం, రాయపేట, మైలాపూర్, టి. నగర్ వంటి కీలక ప్రదేశాల్లో ఏసీ షెల్టర్లు నిర్మించనున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యవంతమైన సీటింగ్, కార్మికులు వస్తువులు పెట్టుకునే ప్లేస్, చార్జింగ్ సౌకర్యం, పార్కింగ్ స్థలాలు ఉంటాయి. ముఖ్యంగా వేసవి, వర్షాకాలం తీవ్ర ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు. అలాగే ప్రధాన రహదారుల వెంట పెద్ద సంఖ్యలో గుమిగూడి డెలివరీ ఆర్డర్ల కోసం గిగ్ వర్కర్లు ఎదురు చూస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ, భద్రతా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కార్మికులు వీధుల్లో వేచి ఉన్నప్పుడు తరచుగా దొంగతనాలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఏసీ షెల్టర్లు అందుబాటులోకి వస్తే గిగ్ వర్కర్లు ఇబ్బందులకు గురవకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, షెల్టర్లకు సంబంధించిన నమూనా మోడల్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అన్ని నగరాల్లో ఇలాంటి సౌకర్యాలు గిగ్ వర్కర్ల కోసం అందుబాటులోకి రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.






