శంభాజీనగర్‌లో మసీదు కూల్చివేత ఎంఐఎం అధినేత ఓవైసీ ఆగ్రహం

by Malleboina Mahesh |

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో వక్ఫ్ భూమిలో ఉన్న మసీదు కూల్చివేతలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

శంభాజీనగర్‌లో మసీదు కూల్చివేత ఎంఐఎం అధినేత ఓవైసీ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో వక్ఫ్ భూమిలో ఉన్న మసీదు కూల్చివేతలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తుర్క్‌మాన్ గేట్ వద్ద ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో జరిగిన కూల్చివేతలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ భూమి పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ (RSS) నేపథ్యం ఉన్న 'సేవ్ ఇండియా ఫౌండేషన్' వేసిన పిటిషన్‌పై నవంబర్ 12న ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చిందని, అయితే కోర్టు ఆదేశించిన సర్వేలో వక్ఫ్ బోర్డును పక్షం (party)గా చేర్చకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు.

ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఈ కేసులో జోక్యం చేసుకుని, వక్ఫ్ గెజిట్ నోటిఫికేషన్‌ను కోర్టుకు సమర్పించి ఉండాల్సిందని ఓవైసీ అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్ వేయకపోవడం వల్లే కోర్టు తప్పుడు నిర్ణయం తీసుకుందని, తద్వారా వక్ఫ్ ఆస్తికి నష్టం వాటిల్లిందని ఎంపీ ఒవైసీ విమర్శించారు. 1947లో అది మసీదుగా ఉండేదని గుర్తుచేస్తూ.. వెంటనే వక్ఫ్ బోర్డు, నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించి, వాస్తవాలను వివరించి 'స్టేటస్ కో' (యథాతథ స్థితి) తెచ్చుకోవాలని సూచించారు.

అలాగే ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌ల కు బెయిల్‌ ఇవ్వకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఒవైసీ.. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు న్యాయస్థానంలో బెయిల్ లభించకపోవడంపై కూడా ఓవైసీ స్పందించారు. ఇన్ని రోజులైనా వారికి బెయిల్ రాకపోవడం తనకు ఆశ్చర్యాన్ని, తీవ్ర దిగ్భ్రాంతిని (shocking) కలిగిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో చెప్పుకొచ్చారు.

Next Story