- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AIIMs: రోడ్డు ప్రమాదాలకు నిద్ర లేకపోవడమే కారణం: ఎయిమ్స్ రిపోర్ట్
భారీ ట్రక్కులే కాదు, రోజూవారీగా ప్రయాణించే చిన్న వాహనాలు కూడా మగత డ్రైవింగ్ వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: సాధారణంగా తాగి వాహనం నడిపిస్తే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తుంటారు. కానీ తాజా ఓ అధ్యయనంలో చాలా రోడ్డు ప్రమాదాలకు తాగి నడపడం వల్ల కంటే నిద్ర సంబంధిత రుగ్మతలే అతిపెద్ద కారణాలుగా ఉంటున్నాయని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), రిషికేశ్ నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. దూర ప్రాంతాలకు వెళ్లే భారీ ట్రక్కులే కాదు, రోజూవారీగా ప్రయాణించే చిన్న వాహనాలు కూడా మగత డ్రైవింగ్ వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. అధికారులు తరచుగా తాగి వాహనాలు నడపడానికి వ్యతిరేకంగా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అయితే దాని కంటే ఎక్కువగా నిద్రలేమితో జరిగే ప్రమాదాల సంఖ్య, నష్టం ఎక్కువగా కనిపిస్తోందని ఎయిమ్స్ సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌లోని స్లీప్ డివిజన్ వివరించింది.
21 శాతం ప్రమాదాలకు నిద్ర సమస్యలే కారణం
2021, అక్టోబర్ నుంచి 2022, ఏప్రిల్ మధ్య ఎయిమ్స్‌లో చేరిన వివిధ రోడ్డు ప్రమాదాలలో గాయపడిన సుమారు 1,200 మంది వ్యక్తుల నుంచి వివరాలను సేకరించారు. వారిలో 575 మంది డ్రైవర్లలో 75 శాతం మంది టూ-వీలర్ లేదా త్రీ-వీలర్ వాహనాలను నడుపుతున్నారు. 21 శాతం ప్రమాదాలు డ్రైవర్లకు నిద్రపోవడం లేదా వాహనం నడుపుతున్నప్పుడు నిద్ర సంబంధిత సమస్యలను ఎదురవడం వల్లనే జరుగుతున్నాయని ఎయిమ్స్ పరిశోధనలో తెలిసిందని స్టడీ నిర్వహించిన డైరెక్టర్లు ప్రొఫెసర్ రవి గుప్తా, డాక్టర్ విశాల్ ధీమాన్ పేర్కొన్నారు. మరో 26 శాతం ప్రమాదాలకు అధిక పని వల్ల కలిగే అలసట కారణమని వారు వెల్లడించారు. 32 శాతం ప్రమాదాలలో మద్యం ఒక కారణం అయినప్పటికీ, ఈ డ్రైవర్లలో చాలామంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారని, మద్యం సేవించడం వారి పరిస్థితిని మరింత దిగజారేలా చేస్తోంది. ఆశ్చర్యకరంగా, నిద్ర సంబంధిత ప్రమాదాలలో దాదాపు 68 శాతం రోజువారీ సర్వీస్ రోడ్లపైనే జరిగాయి. చాలా సంఘటనలు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య జరిగాయని నివేదిక స్పష్టం చేసింది.
దీని పరిష్కారం కోసం వైద్య నిపుణులు డ్రైవర్లకు ప్రధానమైన మార్పులు చేసుకునే వీలు కల్పించాలి. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే సమయంలో నిద్ర రుగ్మతలకు స్క్రీనింగ్ తప్పనిసరి అనే రూల్ ఉండాలని భావిస్తున్నట్టు ప్రొఫెసర్ రవి గుప్తా అన్నారు. లైసెన్సింగ్ ప్రక్రియలో వైద్య పరీక్షలలో నిద్ర సంబంధిత సమయలు చేర్చితే, సాధారణ తనిఖీలతో పాటు నిద్ర గురించి తెలుసుకుని డ్రైవర్లకు సరైన సూచనలు చేసే వెసులుబాటు లభిస్తుందని రవి గుప్తా వివరించారు.






