- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AICC: మోడీ చెబుతున్న అభివృద్ధి సత్యం ఇదే.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్
కష్టం ప్రజలది.. లాభం ఎవరిది.. ఇదే మోడీ అభివృద్ధి(Modi development) చెందిన భారతదేశ సత్యం అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC leader Rahul Gandhi) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కష్టం ప్రజలది.. లాభం ఎవరిది.. ఇదే మోడీ అభివృద్ధి(Modi development) చెందిన భారతదేశ సత్యం అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC leader Rahul Gandhi) అన్నారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ది(Economy Development) పై స్పందిస్తూ.. సంచలన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థ మీ అందరి చెమట, రక్తంతో నడుస్తోందని, కానీ అందులో మీకు తగిన వాటా లభిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి అని ప్రశ్నించారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 60 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని, దీంతో ఉపాధి దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వ్యవసాయ రంగంలో తప్పుడు విధానాల వల్ల రైతులు, రైతు కూలీల పరిస్థితి మరింత దిగజారిందని, గత ఐదేళ్లలో కార్మికుల వాస్తవ ఆదాయం మరింతగా క్షీణించిందని అన్నారు. అంతేగాక హానికరమైన జీఎస్‌టీ(GST), ఆదాయపు పన్ను(Income Tax) భారం పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని దుర్భరంగా మార్చాయని, కానీ కార్పొరేట్ రుణాలు(Corporate loans) మాత్రం మాఫీ(waived) చేయబడ్డాయని చెప్పారు. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పేదలే కాక జీతాలు తీసుకునే వాళ్లు కూడా తమ అవసరాలు తీర్చుకోవడానికి రుణాలు తీసుకోవలసి వస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి అని, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం, న్యాయమైన పన్ను విధానం, కార్మికుల ఆదాయం పెరుగుతుందని, అప్పుడే దేశం సుభిక్షంగా, పటిష్టంగా ఉంటుందని రాహుల్ గాంధీ వెల్లడించారు.






