Flash News: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అస్వస్థత

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-01 07:47:33  IST  )

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చేర్పించారు.

Flash News: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి జనరల్ వార్డులో పొందుతున్నారు. ఖర్గేకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం రావడంతో సమస్యలు తలెత్తాయి. కాగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడేవరకూ వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని చెప్పారు. ఆయనకు వైద్యులు పేస్ మేకర్ అమర్చాలని తెలిపారని కుమారుడు ప్రియాంక్ వెల్లడించారు. ఖర్గే ఆస్పత్రి పాలయ్యారని తెలిసిన కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 2022 అక్టోబర్ నుంచి ఆయన ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Next Story