AICC: సావర్కర్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి భారీ ఊరట

by Ramesh Goud |

వీడీ సావర్కర్ పరువు నష్టం కేసులో లోక్ సభ పక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి(Opposition Leader Rahul Gandhi) భారీ ఊరట(Big Relief) లభించింది.

AICC: సావర్కర్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి భారీ ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: వీడీ సావర్కర్ పరువు నష్టం కేసులో లోక్ సభ పక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి(Opposition Leader Rahul Gandhi) భారీ ఊరట(Big Relief) లభించింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి పూణే ప్రత్యేక కోర్టు(Pune Special Court) బెయిల్(Bail) మంజూరు చేసింది. రాహుల్ గాంధీ 2023 లండన్ పర్యటనలో భాగంగా వీడీ సావర్కర్(VD Savarkar) పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. వీడీ సావర్కర్ మనవడు సత్యకీ సావర్కర్(Sathyaki Savarkar) ఫిర్యాదు చేశారు. సావర్కర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఈ వ్యాఖ్యలు తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేశాయని ఫిర్యాదు లో పేర్కొన్నారు.

దీనిపై ఇవాళ పూణే స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణకు రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ కేసులో ప్రత్యేక కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీనిపై ఫిర్యాదు దారు వీడీ సావర్కర్ మనవడు సత్యకీ సావర్కర్ న్యాయవాది మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన దానిపై అభ్యంతరం తెలుపుతున్నామని, కీలక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉపయోగించబడదు అని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Next Story