- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. AAIB రిపోర్టులో సంచలన విషయాలు
అహ్మదాబాద్‌లో జూన్ 12 ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న 240 మంది ప్రయాణికులతో పాటు ఇతరులు మరో 30 మందికిపైగా దుర్మరణ పాలైన విషయం విదితమే.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లో జూన్ 12 ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న 240 మంది ప్రయాణికులతో పాటు ఇతరులు మరో 30 మందికిపైగా దుర్మరణ పాలైన విషయం విదితమే. ఈ నేపథ్యంలోని విమాన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో రిపోర్టును కేంద్రానికి సమర్పించింది. అయితే, ప్రమాదం జరగడానికి గల కారణలు, సంచలన విషయాలను ఏఏఐబీ రిపోర్టులో ప్రస్తావించింది. విమానం ప్రారంభం అయ్యాక గరిష్ట వేగాన్ని అందుకున్నట్లుగా పేర్కొన్నారు. వెంటనే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్‌కు చేంజ్ అయ్యాయని తెలిపారు. దీంతో ఫ్లైట్ టేకాఫ్ అవ్వగానే ఫ్యూయల్ అందక ఇంజిన్-1, ఇంజిన్-2 ఆగిపోయాయని వెల్లడించారు.
ఓ పైలట్ ఇంజిన్లను ఎందుకు ఆఫ్ చేశారని మరో పైలట్ ప్రశ్నించాడని.. అతడు తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చినట్లు కాక్‌పిట్‌లో రికార్డ్ అయిందని నివేదికలో తెలిపారు. అవే పైలట్ల ఆఖరి మాటలని.. ఆ తరువాత పైలట్ నుంచి మేడే కాల్ వచ్చినట్లుగా రిపోర్టులో వెల్లడించింది. టేకాఫ్ అయిన వెంటనే విమాన RAT బయటకు వచ్చిందని.. రెండు ఇంజిన్ల స్విచ్‌లను రన్‌లో తిరిగి ఉంచారని తెలిపారు. దీంతో ఇంజిన్-1లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైందని, ఇంజిన్-2 స్టార్ట్ అయినా.. పవర్ అందుకోలేదని.. మధ్యాహ్నం సరిగ్గా 1.39కి పైలట్ మేడే కాల్ ఇచ్చారని పేర్కొన్నారు. అందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా రెస్పాండ్ అయినా.. పైలట్ల నుంచి రెస్పాన్స్ రాలేదని వెల్లడించారు. ఎయిర్‌పోర్టు కాపౌండ్ దాటే ముందు విమానం కూలిందని, సీసీ ఫుటేజీలో విమానాన్ని పక్షి ఢీకొన్న ఆనవాళ్లు లేవని ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులో వెల్లడించింది.
కాగా, ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేశామని ఏఏఐబీ వెల్లడించింది. ఫ్లైట్‌కు సంబంధించి రెండు ఇంజిన్లను బయటకు తీశామని, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించి వాటిని భద్రపరిచామని తెలిపారు. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని ఏఏఐబీ ఇచ్చిన రిపోర్టులో స్పష్టం చేసింది.






