అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 274కు పెరిగిన మృతుల సంఖ్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-14 15:49:34  IST  )

అహ్మదాబాద్‌ (Ahmadabad)లో ఎయిరిండియా కుప్పకూలిన ఘటనలో 229 మంది ప్రయాణికులతో పాటు, 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 274కు పెరిగిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌ (Ahmadabad)లో ఎయిరిండియా కుప్పకూలిన ఘటనలో 229 మంది ప్రయాణికులతో పాటు, 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. అదేవిధంగా విమానం బీజే మెడికల్ కాలేజీ (BJ Medical College)భవనంపై కూలగా.. అందులో ఉన్న మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయత్రం నాటికి మృతుల సంఖ్య 265గా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి (Civil Hospital)లో చికిత్స పొందుతోన్న మరో 9 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు వెల్లడించారు. దీంతో విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య మొత్తం 274కు చేరింది.

కాగా, ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారణ జరిపేందుకు భారత ప్రభుత్వం (Central Government) హోం సెక్రటరీ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల నుంచి జాయింట్ సెక్రటరీ హోదాకు చెందిన వారిని అవకాశం కల్పించారు. ఈ కమిటీ మూడు నెలల్లో విమాన ప్రమాదంపై సమగ్ర నివేదకను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది.

Next Story