అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు తగ్గిన బుకింగ్స్

by Yella Dhawani Reddy |

అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాదం మొత్తం దేశాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు తగ్గిన బుకింగ్స్
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాదం (Ahmedabad plane crash) మొత్తం దేశాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాకు (Air India) చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలి 275 మంది మృతిచెందారు. ఈ ఘటన ఎయిర్ ఇండియాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అలాగే, ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ విమాన రద్దులు, ఆఖరి నిమిషంలో మార్పులు రావడంతో ప్రయాణికులు వేరే ఎయిర్‌లైన్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఎయిరిండియా టికెట్ బుకింగ్స్ తగ్గుతున్నాయి.

ప్రమాదం తర్వాత బుకింగ్స్‌లో 20 శాతం వరకు తగ్గుదల కనిపిస్తోందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) వెల్లడించింది. దీంతో ఎయిరిండియాపై దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నమ్మకం కాస్త దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా, ప్రమాద ప్రభావంతో సగటు టికెట్ ధరలు కూడా 8 నుంచి 15 శాతం వరకు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పోటీ ఎయిర్‌లైన్ల ప్రభావంతో కొన్ని ప్రధాన మార్గాల్లో టికెట్ ధరలు దాదాపు 10 శాతం వరకు పడిపోయాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా నిర్వహణ, సేవా ప్రమాణాల్లో మెరుగుదల తీసుకురావాల్సిన అవసరం తీవ్రంగా కనిపిస్తోంది. ప్రయాణికుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు పారదర్శకత, సాంకేతిక సమస్యలపై సమర్థవంతమైన స్పందన అవసరం. లేకపోతే, పోటీ విమానయాన సంస్థలు ప్రయాణికులను ఆకర్షించడంలో ముందంజ వేయవచ్చని పర్యాటక రంగ నిపుణుల అంచనా వేస్తున్నారు.

Next Story