ఘోర విమాన ప్రమాదం.. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ మూసివేత

by Gantepaka Srikanth |

గుజరాత్‌(Gujarat)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌(Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం(Plane Crash) కుప్పకూలింది.

ఘోర విమాన ప్రమాదం.. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌(Gujarat)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌(Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం(Plane Crash) కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే జనావాల్లో కూలింది. ప్రమాదం సంభవించిన వెంటనే దట్టమైన మంటలు ఎగిసిపడి అన్ని వైపులా పొగ వ్యాపించింది. దీంతో విమానంతో పాటు పరిసర ప్రాంతాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 240 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే 12 ఫైరింజన్లతో స్పాట్‌కు వచ్చిన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటన చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులు నిలిపివేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story