Ahmed Khan: సూసైడ్ బాంబ్‌తో పాక్ వెళ్తా.. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్

by B.Srinivas |   (  Updated:2025-05-03 18:28:56  IST  )

పహెల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ahmed Khan: సూసైడ్ బాంబ్‌తో పాక్ వెళ్తా.. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్‌ (India pak) ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ (Zameer Ahmad khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే ఆత్మాహుతి బాంబు ధరించి పాకిస్థాన్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాజాగా ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఆయుధాలను సర్దుకుని సరిహద్దుకు వెళ్లేందుకు సిద్ధమని తెలిపారు. ‘మేము భారతీయులం, మేము హిందుస్తానీలం. పాకిస్థాన్ తో మాకు ఎలాంటి సంబంధాలూ లేవు. ఆ దేశం ఎల్లప్పుడూ భారత్‌కు శత్రువే. యుద్ధం చేయాల్సి వస్తే పోరాడటానికి రెడీగా ఉన్నా. అవసరమైతే సూసైడ్ బాంబుతో పాక్ వెళ్లి అందర్నీ పేల్చేస్తా’ అని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ప్రకటనతో తన చుట్టూ ఉన్న సహచరులు ఒక్కసారిగా నవ్వడంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను జోక్ చేయడం లేదని సీరియస్ గా చెబుతున్నానని నొక్కి చెప్పారు.

Next Story