- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పురుషుల గురించి కూడా ఆలోచించండి'
సూసైడ్ వీడియో నోట్‌లో తన భర్త చేసిన ఆరోపణలు అన్నీ తప్పు అని మృతుడి భార్య పేర్కొంది.

- నా భార్యతో సంబంధాలు చెడిపోయాయి
- చట్టాలు పురుషులను రక్షించవా?
- నా తల్లిదండ్రులను ఏమీ అనకండి
- వీడియో నోట్ పెట్టి సూసైడ్ చేసుకున్న టెకీ
- ఆరోపణలు ఖండించిన భార్య
దిశ, నేషనల్ బ్యూరో: 'పురుషుల సమస్యలను గురించి కూడా ఆలోచించండి. చట్టాలు కూడా పురుషులను రక్షించలేకపోతే.. మీరు నిందించడానికి ఇక భూమ్మీద పురుషులే ఉండరు' అంటూ భావోద్వేగమైన వీడియో నోట్ పెట్టి ఒక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్యను పోలిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఒక ఐటీ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న మానవ్ శర్మ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వీడియో రికార్డు చేశాడు. అందులో తన భార్యతో సంబంధాలు పూర్తిగా చెడిపోయాయని చెప్పాడు. తన భార్య వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. గతంలో కూడా మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తన చేతిపై గాట్లను చూపించాడు. తాను చనిపోయిన తర్వాత తన తల్లిదండ్రులను ఏమీ చేయవద్దని వీడియోలో పేర్కొన్నాడు. కాగా, మృతుడి తండ్రి సర్దార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మృతికి కోడలే కారణమని అందులో పేర్కొన్నారు.
ఆరోపణలు అన్నీ తప్పు : మృతుడి భార్య
సూసైడ్ వీడియో నోట్‌లో తన భర్త చేసిన ఆరోపణలు అన్నీ తప్పు అని మృతుడి భార్య పేర్కొంది. తన భర్తకు విపరీతంగా మద్యపానం చేసే అలవాటు ఉంది. చాన్నాళ్లుగా మద్యపాన సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నాడు. గతంలో కూడా పలు మార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడని భార్య చెప్పింది. గతంలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తే తానే మూడు సార్లు రక్షించానని ఆమె పేర్కొంది. తాగిన తర్వాత చాలా సార్లు తనపై దాడి కూడా చేశాడు. ఈ విషయం ఎన్నో సార్లు అత్తమామలకు చెప్పినా.. వారు పట్టించుకోలేదని బాధితుడి భార్య స్పష్టం చేసింది. అయితే పెళ్లికి ముందు ఇదంతా జరిగిందని, పెళ్లి చేసుకున్న తర్వాత అతను అలా ప్రవర్తించలేదని పేర్కొంది. కాగా, తన భర్త సోదరితో చేసిన వాట్సప్ చాట్‌ను భార్య బయటపెట్టింది. మీ సోదరుడు చనిపోతానని బెదిరిస్తున్నాడని.. మీరే ఏదైనా సాయం చేయాలని తాను అడిగితే.. నిద్రపొమ్మని చెప్పిందని భార్య వెల్లడించింది.
ఈ కేసులో ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆగ్రాలోని మిలటరీ ఆసుపత్రికి తీసుకొని వచ్చినప్పుడే మానవ్ శర్మ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతని ఫోన్ లాక్ చేసి ఉంది. అయితే మృతుడి సోదరికి పాస్‌వర్డ్ తెలుసు. ఆమె ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయగా వీడియో కనపడింది. తన భార్యతో సంబంధాలు చెడిపోయినందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో ఉందని పోలీసులు తెలిపారు.






