- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
fake seeds: నకిలీ విత్తనాలు, ఫెర్టిలైజర్స్ కంపెనీలకు కేంద్రం వార్నింగ్
by Prasad Jukanti |
నకిలీ పురుగుల మందు, ఎరువులు, విత్తనాలను తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నకిలీ పురుగుల మందు, ఎరువులు, విత్తనాలను తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు. రైతులను మోసగించేలా నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీలపై దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇవాళ మధ్యప్రదేశ్ లో పర్యటించిన ఆయన నకిలీ రసాయనాలను పిచికారీ చేయడం వల్ల సోయాబీన్ పంటలను పరిశీలించారు. నకిలీ కలుపు మందుల వల్ల సోయాబీన్ పంటలు దెబ్బతిన్నాయని మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రభావిత పొలాలను సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. ఇక్కడ చౌహాన్ ఆదేశాల మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వెంటనే ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
Next Story






