'చీతా' కూన మృత్యువాత.. 'కునో' నేషనల్ పార్కులో ఘటన

by Geesa Chandu |

ఐదు నెలల వయసున్న చీతా పసికూన మృత్యువాత పడినట్లు మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు.

చీతా కూన మృత్యువాత.. కునో నేషనల్ పార్కులో ఘటన
X

దిశ వెబ్ డెస్క్: ఐదు నెలల వయసున్న చీతా పసికూన మృత్యువాత పడినట్లు మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు. అయితే గామినీ అనే చీతాకు ఈ ఏడాది మార్చిలో ఆరు పసికూనలు జన్మించాయి అందులో ఇది ఒకటి. ఆఫ్రికా ఖండంలోని నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి భారత్ కు చీతాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే నేషనల్ పార్కులోని మిగిలిన 13 పెద్ద చీతాలు మరియు 12 పసికూనలు ఆరోగ్యంగా ఉన్నట్టు కునో అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్ అధికారి ఈ సందర్భంగా వెల్లడించారు.

Next Story