- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajnath Singh: రష్యా పర్యటనకు రాజ్ నాథ్ సింగ్ దూరం
రష్యా (Russia) విక్టరీ డే వేడుకల్లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కూడా పాల్గొనరని సమాచారం. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌ను రష్యాకు పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా (Russia) విక్టరీ డే వేడుకల్లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కూడా పాల్గొనరని సమాచారం. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌ను రష్యాకు పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. విక్టరీ డేలో పాల్గొనాలని మోడీకి రష్యా ఆహ్వానం పంపింది. అయితే, పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పరిణామల దృష్ట్యా మోడీ పర్యటన రద్దు అయ్యింది. మోడీ రావట్లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. ఆ తర్వాత రాజ్‌నాథ్ వెళ్లారని వార్తలు వచ్చినా, ఇప్పుడు ఆయన పర్యటన కూడా రద్దయినట్లు తెలుస్తోంది. కాగా.. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ‘విక్టరీ డే’(మే 9న)ని రష్యా నిర్వహిస్తుంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగానే ఈసారి మిత్ర దేశాధినేతలను పుతిన్ (Vladimir Putin) ఆహ్వానించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోదీకి ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించారు.






