Pakistan: భారత్- పాక్ ఉద్రిక్తతలపై మరోసారి స్పందించిన అమెరికా

by Shamantha N |

భారత్‌, పాక్ ఉద్రిక్తతలపై అమెరికా మరోసారి స్పందించింది. ఇరు దేశాల మధ్య మధ్వవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించిన అమెరికా.. ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తామని స్పష్టంచేసింది.

Pakistan: భారత్- పాక్ ఉద్రిక్తతలపై మరోసారి స్పందించిన అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌, పాక్ ఉద్రిక్తతలపై అమెరికా మరోసారి స్పందించింది. ఇరు దేశాల మధ్య మధ్వవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించిన అమెరికా.. ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తామని స్పష్టంచేసింది. కాగా..ఈ అంశంపైనే అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) యూకే విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్‌ లామీతో మాట్లాడారు. కాల్పుల విరమణ తర్వాత ఇరుదేశాలు ప్రత్యక్షంగా చర్చలు జరపడానికి అమెరికా సాయం చేస్తుందని మార్కో రూబియే అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా, కాల్పుల విరమణ కొనసాగించడం, రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్‌ మార్గాలను తెరిచి ఉంచడం ఎంతో ముఖ్యమని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు.

కాల్పుల విరమణ ఒప్పందం

ఇకపోతే, భారత్, పాక్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా విదేశాంగశాఖ స్వాగతించింది. భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్రమోడీ, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ శాంతి మార్గాన్ని ఎంచుకోవడాన్ని అభినందిస్తున్నామంది. భారత్‌, పాక్‌ ప్రత్యక్ష చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోలు కోరుకుంటున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది.

Next Story