Mamata Banerjee: ఫేక్ ఓటర్లను యాడ్ చేస్తున్నారని దీదీ ఆరోపణలు.. ఖండించిన ఈసీ

by Shamantha N |

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ ఖండించింది.

Mamata Banerjee: ఫేక్ ఓటర్లను యాడ్ చేస్తున్నారని దీదీ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ ఖండించింది. బెంగాల్ సీఈవో ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. చట్టపరమైన ప్రోటోకాల్‌లను అనుసరిస్తూనే ఓటరు జాబితా నవీకరణ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొంది. బెంగాల్ వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను పరిశీలించేందుకు దీదీ కమిటీని ప్రకటించింది. ఆ తర్వాతే రాష్ట్ర ఎన్నికల అధికారి దీనిపై స్పందించింది. ఎన్నికల కమిషన్ దీదీ వ్యాఖ్యలపై స్పందింస్తూ.. "ఓటరు జాబితా తయారీలో ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలు పాల్గొంటాయి. ఏ దశలోనైనా రాజకీయ పార్టీల నుండి ఏదైనా అభ్యంతరం ఉంటే, దాన్ని ఈసీ పరిశీలిస్తుంది. పేర్లు చేర్చడం లేదా తొలగించడంపై ప్రతి అభ్యంతరాన్ని ఎలక్టోరల్ రోల్ అధికారి పరిశీలిస్తారు" అని ప్రకటించింది.

ఈసీపై దీదీ ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. ఎన్నికల సంఘం సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో బీజేపీ చేర్చుతోందని దుయ్యబట్టారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం (Election Commission) కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు హర్యానా, గుజరాత్‌ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతోందని దీదీ ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లోనూ బీజేపీ ఇలాంటి వ్యూహాలనే అమలు చేసిందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తే విజయం సాధించలేమని బీజేపీకి తెలుసని.. అందుకే తప్పుడు జాజబితాను రూపొందించే పనిలో పడిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇక్కడ రావని, బీజేపీ బెంగాల్ స్వాధీనం చేసుకోవడాన్ని తాము అనుమతించబోమన్నారు.

Next Story