హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్‌.. ఇటలీకి చెందిన లియోనార్డోతో ఒప్పందం

by Kema Shiva Kumar |

భారత రక్షణ, వైమానిక రంగాన్ని బలోపేతం చేసేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) కీలక అడుగు వేసింది.

హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్‌.. ఇటలీకి చెందిన లియోనార్డోతో ఒప్పందం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ, వైమానిక రంగాన్ని బలోపేతం చేసేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) కీలక అడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ సంస్థ లియోనార్డో (Leonardo)తో కలిసి భారత్‌లో సమగ్ర హెలికాప్టర్ తయారీ వ్యవస్థను (Ecosystem) ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. దీంతో భారత సాయుధ దళాలకు రాబోయే పదేళ్లలో అవసరమయ్యే దాదాపు వెయ్యి కంటే ఎక్కువ హెలికాప్టర్ల తయారీయే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.

ముఖ్యంగా లియోనార్డోకు చెందిన అత్యాధునిక మోడల్స్ అయిన AW169M, AW109 TrekkerM హెలికాప్టర్ల తయారీపై ఈ సంస్థలు దృష్టి సారించనున్నాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌లో భాగంగా, హెలికాప్టర్ విడిభాగాలను దశలవారీగా భారత్‌లోనే తయారు చేయనున్నారు. హెలికాప్టర్ల తయారీతో పాటు, వాటి నిర్వహణ (MRO - Maintenance, Repair, and Overhaul) పైలట్ల శిక్షణ కోసం అత్యాధునిక కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌తో ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసింగ్ రంగాల్లో వేలాది మందికి ఉపాధి లభించనుంది. ఈ ఒప్పందంతో భారత్ గ్లోబల్ ఏరోస్పేస్ సరఫరాలో ఒక కీలక భాగస్వామిగా మారడమే కాకుండా, రక్షణ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడం పూర్తిగా తగ్గనుంది.

Next Story