Praneetha Subhash: వీఐపీ సంస్కృతిపై నటి ప్రణీత సుభాష్ ఆగ్రహం

by Ramesh Naini |

రాజకీయ నేతల వీఐపీ సంస్కృతిపై ప్రముఖ నటి ప్రణీత సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Praneetha Subhash: వీఐపీ సంస్కృతిపై నటి ప్రణీత సుభాష్ ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయ నేతల వీఐపీ సంస్కృతిపై ప్రముఖ నటి ప్రణీత సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ రాజకీయ నేత కదలికల కోసం రోడ్లను మూసివేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె మండిపడ్డారు. ఈ పరిస్థితిని ఉద్దేశించి ‘This is frustrating’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇటీవల బయటకు వెళ్లిన సమయంలో బెంగళూరులోని సిటీ సెంటర్, కోరమంగళ ప్రాంతాల వైపు వెళ్లే రోడ్లను వీఐపీ కదలికల కారణంగా మూసివేయడంతో తీవ్ర అసౌకర్యం ఎదురైందని ప్రణీత తెలిపారు. ఇలాంటి చర్యలు ప్రజల రోజువారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. రాజకీయ నాయకుల వీఐపీ జీవనశైలి దేశాభివృద్ధికి ఏమాత్రం దోహదపడటం లేదని, దానికి బదులుగా మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నాయని ప్రణీత స్పష్టం చేశారు.

దేశం ముందుకు వెళ్లడం కష్టం

ఇలాంటి వ్యవస్థ కొనసాగితే దేశం ముందుకు వెళ్లడం కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విటర్)లో ప్రణీత సుభాష్ స్పందిస్తూ, ‘సిటీ సెంటర్, కోరమంగళ వైపు వెళ్లే రోడ్లు వీఐపీ కదలికల కోసం మూసివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ నాయకుల వీఐపీ జీవితాలే దేశాన్ని ముందుకు నడిపించకుండా వెనక్కి నెట్టుతున్నాయి’ అని ట్వీట్ చేశారు. ప్రణీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీఐపీ సంస్కృతిపై ఆమె చేసిన వ్యాఖ్యలకు పలువురు నెటిజన్లు మద్దతు తెలిపారు.

Next Story