- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళ హైకోర్టును ఆశ్రయించిన దుల్కర్ సల్మాన్
నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) కేరళ హైకోర్టును (Kerala High Court) ఆశ్రయించారు.

దిశ, వెబ్‌డెస్క్: నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) కేరళ హైకోర్టును (Kerala High Court) ఆశ్రయించారు. కస్టమ్స్ అధికారులు (Customs Officials) తన SUV కారును సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 23) కస్టమ్స్ అధికారులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prudhvi Raj Sukumaran) ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. భూటాన్ నుంచి అధిక సంఖ్యలో కార్లను అక్రమంగా తెప్పించుకున్నారన్న సమాచారంతో ఈ దాడులు జరిగాయి. వారి ఇళ్లతో పాటు 35 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు 38 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో దుల్కర్ సల్మాన్ వాడుతున్న ల్యాండ్ రోవర్ SUV కూడా ఉంది.
తన కారును కస్టమ్స్ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ శుక్రవారం ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించారు. వాహనాన్ని తిరిగి తీసుకునేందుకు చట్టపరంగా అన్నింటినీ పూర్తి చేశానని, తన వాహనాన్ని తనకు ఇప్పించాలని కోరినా కస్టమ్స్ నుంచి స్పందన లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఐదేళ్లుగా ఆ కారు తనవద్దే ఉందని, అందుకు తగిన ఆధారాలను కూడా సమర్పించినట్లు కోర్టుకు తెలిపారు. దుల్కర్ తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు.. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.






