- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడు దర్శన్‌కు చుక్కెదురు.. బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు
రేణుకా స్వామి (Renuka Swamy) హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan)కు బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: రేణుకా స్వామి (Renuka Swamy) హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan)కు బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ఆయనకు ఇచ్చిన మద్యంతర బెయిల్‌ను రద్దు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. కాగా, కేసులో దర్శన్, ఇతర నిందితులకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
అయితే, వాదనల సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు దర్శన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని కామెంట్ చేశారు. బెయిల్ మంజూరు చేయడం వల్ల నిందుతులు సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని, సాక్ష్యాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉందని అన్నారు. చట్టం ముందు అందూ సమానులేనని.. ప్రస్తుతం కస్టడీలో దర్శన్‌కు ఎలాంటి ప్రత్యేక వసతులు ఇవ్వాల్సి అవసరం లేదని జైలు అధికారులకు మొట్టికాయలు వేశారు. ఇకవేళ అలా చేసిట్లుగా తమ దృష్టికి వస్తే.. జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకుంటామని, వెంటనే దర్శన్‌ను అదుపులోకి తీసుకోవాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.






