- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ajaz Khan: నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు, హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ భార్య ఫాలన్ గులివాలాను డ్రగ్స్ కేసులో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం అరెస్టు చేసినట్లు ఓ అధికారి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ముంబైలోని జోగేశ్వరి శివారులోని ఆమె నివాసంపై కస్టమ్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించి 130 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ సర్వీస్ ద్వారా విదేశాల నుంచి 100 గ్రాముల మెఫెడ్రోన్‌ను ఆర్డర్ చేసినందుకు అజాజ్ ఖాన్ ఆఫీసులో పనిచేస్తున్న ప్యూన్‌ను అక్టోబర్ 8న కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో గులివాలా పాత్ర వెలుగులోకి వచ్చిందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె నివాసంలో జరిగిన సోదాల్లో 136 గ్రాముల చరాస్, 33 గ్రాముల మెఫెడ్రోన్ పౌచ్‌లు, 28 గ్రాముల మాత్రలు, ఇతర మత్తు పదార్థాలు, రూ. 11 లక్షల నగదు లభించాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి తదుపరి విచారణ జరుగుతోంది. కాగా, 2021లో మాదక ద్రవ్యాల కేసులోనే అజాజ్ ఖాన్ స్వయంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ద్వారా అరెస్టు అయి, బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వెర్సోవా నుంచి పోటీ చేశారు.