స్థానిక ఎన్నికల్లో ఓటమి.. మీసాలు తీయించుకున్న కార్యకర్త

by Muthe.Rajitha |

ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలవడంతో తన శపథాన్ని స్వీకరించి సంచలనం సృష్టించాడు ఓ కార్యకర్త.

స్థానిక ఎన్నికల్లో ఓటమి.. మీసాలు తీయించుకున్న కార్యకర్త
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలవడంతో తన శపథాన్ని స్వీకరించి సంచలనం సృష్టించాడు ఓ కార్యకర్త. సవాల్ ప్రకారం మీసం తొలగించి అందరికీ షాక్ ఇచ్చాడు. కేరళ స్థానిక ఎన్నికల్లో పతనంతిట్ట మున్సిపాలిటీలో LDF గెలుస్తుందని ఆ పార్టీ కార్యకర్త బాబు వర్గీస్ ధీమా వ్యక్తం చేసాడు. ఒకవేళ అలా గెలవకపోతే తన మీసాలు తీయించుకుంటానని ఛాలెంజ్ చేసాడు. అయితే అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని UDF విజయం సాధించింది. దీంతో తన సవాలును స్వీకరించిన బాబు.. సెలూన్ కి వెళ్లి మీసాలు తీయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story