- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరమే అయినా ప్రేమతో జరిగిన చర్య : పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక అమ్మాయి మైనర్ గా ఉన్నపుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుని.. ఆ తర్వాత ఆమెనే పెళ్లాడి బిడ్డను కూడా కన్న వ్యక్తిపై పోక్సో చట్టం కింద ఉన్న కేసులను రద్దు చేసింది. ఇది కామంతో జరిగిన చర్య కాదని, ఇద్దరి మధ్య ప్రేమతో జరిగిందని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం వారికి ఏడాది వయసున్న కొడుకు ఉండగా.. అతని భార్య సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు కోర్టుకు తెలిపిందని వెల్లడించింది. సదరు మహిళ తండ్రి సైతం అతనిపై ఉన్న నేరారోపణలను క్లోజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జస్టిస్ దీపాంకర్ దత్తా, ఎజీ మసిహ్ తో కూడిన ధర్మాసనం గుర్తించింది. తన భర్తపై నేరస్తుడన్న ముద్ర లేకుండా.. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆమె ఆశపడుతుందని, క్రిమినల్ చర్యలు కొనసాగించి, అతడిని జైల్లో ఉంచితే వారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. శిక్షను రద్దు చేసేందుకు ఆర్టికల్ 142 అనే రాజ్యాంగంలో ఉన్న విచక్షణాధికారాన్ని ఉపయోగించింది. కానీ.. ఆమెకు భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు కలుగజేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.






