ప్రేమను నిరాకరించిందని మైనర్‌పై యాసిడ్ దాడి..

by Disha Web Desk 6 |
ప్రేమను నిరాకరించిందని మైనర్‌పై యాసిడ్ దాడి..
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కొంత మంది ప్రేమించలేదని అమ్మాయిలపై దాడి చేస్తే. మరికొంత మంది లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా, కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది ప్రేమను నిరాకరించిందని ఓ మైనర్‌పై యాసిడ్ దాడి చేశాడు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కనకపురలో 22 ఏళ్ల యువకుడు మైనర్ బాలికను కనకపురలోని బైపాస్‌ రోడ్డు దగ్గర కలవాలని పిలిచాడు. అక్కడకు వచ్చాక నిన్ను ప్రేమిస్తున్నానని బాలికకు చెప్పారు. దానికి ఆ బాలిక అంగీకరించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు బాలికపై యాసిడ్ దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది.

ఈ విషయం బాలిక సోదరుడి స్నేహితులకు తెలియడంతో బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె కన్ను దెబ్బతినింది. ఆమె కంటిలోని మూడు పొరల్లోకి యాసిడ్ పోయిందని డాక్టర్ తెలిపారు. బాలిక సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని వెతికి పట్టుకున్నారు. దాడి చేసిన వ్యక్తి మెకానిక్‌గా పనిచేస్తున్న కురుపేటకు చెందిన సుమంత్‌గా గుర్తించారు.



Next Story

Most Viewed