Acb case: రూ.2 వేల కోట్ల స్కామ్‌.. ఆప్‌ నేతలపై ఏసీబీ కేసు

by B.Srinivas |

రూ. 2000 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లపై కేసు నమోదైంది.

Acb case: రూ.2 వేల కోట్ల స్కామ్‌.. ఆప్‌ నేతలపై ఏసీబీ కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో గదుల నిర్మాణంలో భాగంగా రూ. 2000 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) నాయకులు మనీష్ సిసోడియా (Manish sisodiya), సత్యేంద్ర జైన్ (Sathyendra jain) లపై అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆప్ ప్రభుత్వ హయాంలో 12,748 పాఠశాలల్లో తరగతి గదులు, కొత్త భవనాల నిర్మాణంలో ఈ స్కామ్ జరిగిందని ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ తాజాగా కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ పనులకు గాను అధిక ధరలకు కాంట్రాక్టులు అప్పజెప్పినప్పటికీ నిర్ణీత వ్యవధిలోపు ఒక్క పని కూడా పూర్తి కాకపోవడంతో ఖర్చు భారీగా పెరిగింది.

అంతేగాక నిర్మాణ పనులకు కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌ల నియామకం కూడా ఏకపక్షంగా జరిగిందని విమర్శలున్నాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-A కింద అనుమతి పొందిన తర్వాత ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. 34 కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వగా వాటిలో ఎక్కువ భాగం ఆప్‌తో అనుసంధానించబడి ఉన్నాయని తెలుస్తోంది. పలువురు బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఏసీబీ అవకతవకలను గుర్తించినట్టు సమాచారం. తాజా కేసు నమోదుతో ఆప్‌కు భారీ షాక్ తగిలినట్టు అయింది.

Next Story