- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన ఆప్ ఎంపీ
ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్వయంగా రాఘవ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ యూనిఫాం ధరించి, డెలివరీ బ్యాగ్‌తో స్కూటర్‌పై సామాన్లు ఇంటింటికీ అందిస్తున్నట్టు వీడియోలో ఉంది. షాపులకు వెళ్లి ఆర్డర్లు తీసుకోవడం, అపార్ట్‌మెంట్లలో డోర్‌బెల్ కొట్టి డెలివరీ చేయడం వంటివి చూపిస్తూ... "బోర్డ్‌రూమ్‌లకు దూరంగా, గ్రౌండ్ లెవల్‌లో గిగ్ వర్కర్లతో గడిపాను. స్టే ట్యూన్డ్!" అని క్యాప్షన్ పెట్టారు.
గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు, భద్రత సమస్యలు, 10 నిమిషాల డెలివరీ ఒత్తిడి వంటి కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని పాలసీల్లో మార్పులు తేవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశానని ఆయన చెప్పారు. అయితే చాలా మంది రాఘవ్ చొరవను ప్రశంసించగా.. కొందరు పొలిటికల్ స్టంట్ అని విమర్శించారు.






