అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక గాంధీ.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

by Javid Pasha |

ఆప్ యువ ఎంపీ రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక గాంధీ అని ఆయన కొనియాడారు.

అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక గాంధీ.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
X

దిశ, వెబ్ డెస్క్: ఆప్ యువ ఎంపీ రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక గాంధీ అని ఆయన కొనియాడారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్ ను నెంబర్ వన్ గా నిలపడమే లక్ష్యంగా ఆప్ పని చేస్తోందని అన్నారు. దర్యాప్తు సంస్థలకు తాము భయపడబోమని ఎంపీ స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడలేదని తెలిపారు. కేజ్రీవాల్ అవినీతిపరుడైతే ప్రపంచంలో మంచివారు అంటూ ఎవరూ ఉండరు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పై ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా చేసిన తాజా కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

Next Story