- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన భర్త (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నా మహిళలపై పురుషాధిక్యత మాత్రం ఇంకా పోవటం లేదు..

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నా మహిళలపై పురుషాధిక్యత మాత్రం ఇంకా పోవటం లేదు. రోజూ అనేక చోట్ల ఇంకా వెలుగుజూస్తూనే ఉంది. తాజాగా సమాజంలో ప్రజల సమస్యలపై పోరాడే మహిళా ఎమ్మెల్యే ఇంటిలో వేధింపులకు గురికావడం దారుణం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బల్‌జిందర్ కౌర్‌ను ఆమె భర్త కొట్టాడు. వెంటనే పక్కన ఉన్న వారు అతడిని ఆపారు.
ఈ ఘటన పంజాబ్ తల్వాండి సాబో ప్రాంతంలోని ఆమె నివాసం బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై పంజాబ్ ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి స్పందించారు. ప్రజల సమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారానికి పోరాడే ఓ మహిళా నేతకు ఇలా జరుగుతుండడం చాలా బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ వీడియోపై ఎమ్మెల్యే బల్‌జిందర్ కౌర్ కానీ ఆమె భర్త కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
Also Read : బుసలు కొడుతున్న నాగుపాములకు స్నానం చేయిస్తున్న మహిళ (వీడియో)






