- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AAP: ఇండియా కూటమి లోక్‌సభకే పరిమితం.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ప్రకటించారు. కాంగ్రెస్, ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలతో ఎటువంటి పొత్తూ ఉండబోదని స్పష్టం చేశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమి కేవలం లోక్ సభ ఎన్నికల కోసం మాత్రమేనని తెలిపారు. ప్రస్తుత జరగబోయే బిహార్ ఎన్నికల్లో (Bihar elections) ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. గుజరాత్‌లోని విసావదర్ ఉప ఎన్నికలో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయని, పొత్తు ఉంటే ఇలా ఎందుకు చేస్తామని ప్రశ్నించారు.
ఆ బైపోల్‌లో కాంగ్రెస్ కంటే మూడు రెట్లు ఎక్కువ ఓట్లతో గెలిచామని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఒక్కటేనని తను ఓడించేందుకే కాషాయ పార్టీ కాంగ్రెస్‌ను బరిలోకి దింపిందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ దూసుకెళ్తుందని నొక్కి చెప్పారు. 2027లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపొందుతుందని దీమా వ్యక్తం చేశారు. కాగా, గుజరాత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో ఉన్నారు. పార్టీ సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించారు.






