- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఇండియా కూటమి'కి భారీ షాక్.. కూటమి నుంచి ఆప్ బయటికి
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇండియా కూటమి (INDIA Alliance) నుంచి బయటకు వచ్చినట్లు నేడు అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా కూటమికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇండియా కూటమి (INDIA Alliance) నుంచి బయటకు వచ్చినట్లు నేడు అధికారికంగా ప్రకటించింది. 2024 జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు AAP రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. ఈ కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసం మాత్రమే ఏర్పడిందని, ఇప్పుడు ఆ లక్ష్యం ముగిసినందున AAP ఇకపై ఈ కూటమిలో భాగం కాదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. జులై 21 నుండి ఆగస్టు 21 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరగబోయే ఇండియా కూటమి సమావేశంలో ఆప్ పాల్గొనబోదని తెలియజేశారు. ఆప్ ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్‌తో ఉన్న రాజకీయ విభేదాలు, ముఖ్యంగా ఢిల్లీ, హరియాణా ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య ఘర్షణలు తెలియ జేస్తున్నాయి.
ఇండియా కూటమి 2023లో 28 పార్టీలతో ప్రతిపక్ష కూటమిగా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDAను ఓడించే లక్ష్యంతో ఏర్పాటైంది. ఈ కూటమిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (TMC), సమాజ్‌వాదీ పార్టీ (SP), రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జనతాదళ్ (యునైటెడ్), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇతర పార్టీలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఈ కూటమి 234 సీట్లు గెలుచుకుని, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మరియు పశ్చిమ బెంగాల్‌లో గణనీయమైన సీట్లు సాధించింది. ప్రస్తుతం కూటమి నుంచి ఆప్ బయటకు రావడంతో ఇండియా కూటమిలో చీలికలు స్పష్టమయ్యాయి. రానున్న బీహార్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది.






