- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధన్‌ఖడ్ రాజీనామాపై ఆప్ అనుమానం.. కేంద్రం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్
భారతదేశ రాజకీయాల్లో అంచనాలు తలకిందులయ్యేలా చేయడమే జరిగిందని చెప్పవచ్చు.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ రాజకీయాల్లో అంచనాలు తలకిందులయ్యేలా చేయడమే జరిగిందని చెప్పవచ్చు. మరో రెండేళ్లు పదవీకాలం మిగిలి ఉండగానే ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagadeep dhankhar) తన పదవికి రాజీనామా చేయడం రాజధానిలో చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఆయన ఆరోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా పేర్కొన్నా, విపక్షాలు మాత్రం ఈ నిర్ణయంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.ఆప్ పార్టీ (AAP Party) ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ఉప రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇంత అకస్మాత్తుగా వైదొలగడంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఢిల్లీలో మీడియాతో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ..
"ధన్‌ఖడ్ రాజీనామా చేసిన తర్వాత చాలా సమయం గడిచాకే ప్రధాని మోదీ 'ఎక్స్' (ట్విటర్) వేదికగా స్పందించారు. ఆ జాప్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆయన నిర్ణయాన్ని మార్పించేందుకు ప్రయత్నించిందన్న సంకేతాలు లేవు. అలాంటప్పుడు అసలు కారణం అనారోగ్యమేనా అనే సందేహం సహజం." ధన్‌ఖడ్ రాజీనామా చేసిన కొన్ని గంటలకే పలువురు రాజకీయ నాయకులు, నిపుణులు దీనిపై అనేక ఊహాగానాలు వ్యక్తం చేశారు. ఒకవైపు అధికార పార్టీ మౌనంగా ఉండటం, మరోవైపు ప్రధానమంత్రి ఆలస్యంగా స్పందించడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయం వెనుక అనారోగ్య సమస్యలే ఉన్నాయా? లేకపోతే రాజకీయ ఒత్తిడులా? అధికార-విపక్ష మధ్య మాటల యుద్ధానికి ఈ రాజీనామా నాంది పలికినట్టే కనిపిస్తోంది.






