AAP: ఉప ఎన్నికల్లో ఆప్ హవా.. రెండు కీలక సెగ్మెంట్లలో గెలుపు

by B.Srinivas |

నాలుగు రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి.

AAP: ఉప ఎన్నికల్లో ఆప్ హవా.. రెండు కీలక సెగ్మెంట్లలో గెలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: నాలుగు రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. గుజరాత్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరగగా కాడి స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్దా, విశావదర్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) అభ్యర్థి ఇటాలియా గోపాల్ (Italia gopal) గెలుపొందారు. పంజాబ్‌లోని లుథియానా వెస్ట్ సెగ్మెంట్‌లో ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా (Sanjeev arora) విజయం సాధించారు. అలాగే కేరళలోని నీలంబూర్ నియోజవర్గంలో జరిగిన బైపోల్‌లో కాంగ్రెస్ నేత ఆర్యదన్ షౌకత్ గెలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని కలిగంజ్ సీటును టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్ కైవసం చేసుకున్నారు. కాగా, ఈ ఐదు స్థానాలకు ఈ నెల 19న పోలింగ్ జరిగింది.

గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా

గుజరాత్‌లోని కాడి, విశావదర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ (Shaktisinh Gohil) తన పదవికి రాజీనామా చేశారు. ఫలితాలు వెల్లడైన వెంటనే గోహిల్ తన రాజీనామా ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అంచనాలకు తగ్గట్టుగా రాలేదని తెలిపారు. తన రిజైన్ లెటర్‌ను కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు పంపించారు.

Next Story