- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విద్యార్థి విభాగాన్ని ప్రారంభించింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పార్టీ అధికారిక విద్యార్థి విభాగాన్ని ప్రారంభించారు. అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ (ASAP) పేరుతో ఆ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఏఎస్ఏపీని క్యాంపస్ లోనే మార్పు కోసం ప్రారంభమయ్యే యుద్ధం అని పేర్కొన్న కేజ్రీవాల్.. అభివృద్ధిపై దృష్టి సారించే యువతను సమీకరించడమే దీని లక్ష్యమన్నారు. దేశంలోని అన్ని సమస్యలు కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీలు ఆచరిస్తున్న రాజకీయాల్లోనే పాతుకుపోయాయన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రధాన పార్టీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ ప్రత్యామ్నాయ రాజకీయాలు మాత్రమే పరిష్కరించగలవని అన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వాన్ని గత ఆప్ పరిపాలనతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. మూడు నెలలు కాకముందే బీజేపీ సర్కారు ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేయడం ప్రారంభించిందన్నారు.
కౌన్సిలర్ల రాజీనామాతో..
కాగా.. ఇటీవలే 15 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ (IVP) ఏర్పాటు చేసింది. దీంతో, ఆప్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇలాంటి టైంలో స్టూడెంట్ విభాగాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు. ముఖ్యంగా ఆప్ కు ఇప్పటికే ఛాత్ర్ యువ సంఘర్ష్ సమితి అనే ఒక యువ విభాగం ఉంది. ఇది ఢిల్లీ విశ్వవిద్యాలయంతో సహా విద్యార్థి సంఘాల ఎన్నికలలో పోటీ చేసింది. అయితే, ఏఎస్ఏపీ ప్రత్యామ్నాయ రాజకీయాల సూత్రాల చుట్టూ ప్రత్యేకంగా విద్యార్థులను సమీకరించడంపై దృష్టి సారించింది.






