అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB నివేదిక.. బోయింగ్ సంస్థ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-12 03:44:59  IST  )

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB నివేదిక.. బోయింగ్ సంస్థ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌‌డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో రిపోర్టును కేంద్రానికి సమర్పించింది. అయితే, ప్రమాదం జరగడానికి గల కారణలు, సంచలన విషయాలను ఏఏఐబీ రిపోర్టులో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై తాజాగా బోయింగ్ సంస్థ స్పందించింది. తాము విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని, ఈ ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని బోయింగ్ పేర్కొంది.

ప్రమాదంలో కుట్ర కోణం లేదు..

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై ప్రాథమిక నివేదికను ఏఏఐబీ బయటపెట్టింది. ఫ్లైట్ ఫ్యూయల్కం ట్రోల్‌ స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని నిర్ధారించారు. విమానం పయనించిన మార్గంలో పక్షులు తిరిగినట్లుగా కదలికలు కనిపించలేదని అధికారులు స్పష్టం చేసింది. కుట్రం కోణం ఉందని చెప్పడానికి కూడా తగిన ఆధారాలు కూడా లేవని ఏఏఐబీ వెల్లడించింది.

Next Story