ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రాథమిక నివేదిక

by Malleboina Mahesh |

గుజురాత్ లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, 31 మంది మెడికల్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రాథమిక నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్: గుజురాత్ లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం (Air India flight) కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, 31 మంది మెడికల్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ భారీ ప్రమాదం భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం గా నిలిచిపోయింది. దీంతో యావత్ ప్రపంచం మొత్తం ఈ ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ (Excitement) నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 విమాన ప్రమాదంపై తన ప్రాథమిక నివేదిక (Preliminary report)ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation)తో పాటు.. సంబంధిత అధికారులకు సమర్పించింది.జూన్ 12న ఈ ప్రమాదం చోటు చేసుకోగా జులై 11న లోపు నివేదిక ఇవ్వాలని AAIB కేంద్రం గడువు విధించింది. ఈ క్రమంలో ఈ రోజు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (Aircraft Accident Investigation Bureau) తమ నివేదికను అందించింది. అయితే ఇది దర్యాప్తు యొక్క ప్రాథమిక ఫలితాల ఆధారంగా దాఖలు చేసిన నివేదికగా తెలుస్తుంది.

Next Story