ప్రభుత్వ ఉద్యోగి వద్దు.. నిరుద్యోగి ముద్దు.. ప్రేమంటే ఇదేరా..!

by Disha Web Desk 3 |
ప్రభుత్వ ఉద్యోగి వద్దు.. నిరుద్యోగి ముద్దు.. ప్రేమంటే ఇదేరా..!
X

దిశ డైనమిక్ బ్యూరో: ప్రేమ అంటే రెండు అక్షరాలే అనుకునే వాళ్ళు కొందరైతే.. ప్రేమంటే రెండు అక్షరాలు కాదు ఇద్దరు మనుషులు ఒకటే జీవితం అనుకునేవాళ్లు ఎందరో. అయితే ప్రస్తుతం టైంపాస్ ప్రేమలే కానీ.. కలిసిబ్రతికే ప్రేమలు లేవని యువత అభిప్రాయం. ముఖ్యంగా అమ్మాయిలు తమ అవసరాలకోసం ఒకరి పై ప్రేమ చూపి పెళ్లి మాత్రం ఆర్ధికంగా స్థిరపడిన వ్యక్తిని చేసుకుంటారని చాలామంది అబ్బాయిల అభిప్రాయం.

అయితే ఆ అభిప్రాయం తప్పని నిజమైన ప్రేమ కూడా ఉందని నిరూపించింది ఓ యువతి. ప్రభుత్వ ఉద్యోగి వద్దు నిరుద్యోగి ముద్దు అంటూ పెద్దవాళ్ళని ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని జముయ్ జిల్లా టెటారియా గ్రామానికి చెందిన వర్ష కుమారి, ధునియామన్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ ప్రేమించుకున్నారు.

అయితే ఉమేష్ యాదవ్ కి ఉద్యోగం లేదు. దీనితో యువతి తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమను అంగీకరించలేదు. అలానే యువతి ఇష్టంతో పనిలేకుండా వర్షకు ప్రభుత్వ ఉద్యోగితో పెళ్ళి సంబంధం కుదిర్చారు. అయితే వర్షకు ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. తాను ప్రేమించిన ఉమేష్‌ తో వెళ్లిపోయింది. ఇక ఉమేష్ వర్షను ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.

అయితే యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమేష్‌ ఊరికి వెళ్లి వర్షను అతడి నుంచి విడిపించి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అందరూ చూస్తుండగానే ఉమేష్‌ను కౌగిలించుకుని చావనైనా చస్తాను కానీ వదిలేసి రాను అని వర్ష తేల్చి చెప్పింది. ఇక ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు చేసేదేం లేక వారిని ఇంటికి పంపించారు.

కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అదే ప్రేమ పవర్.. ప్రేమంటే ఇదేరా.. నిజంగా ప్రేమించే అమ్మాయిలు కూడా ఉన్నారని ఈ రోజే తెలిసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed