- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడి కోసం వెళ్లి మరో వ్యక్తిని పెళ్లాడిన యువతి.. అచ్చం ఆ సినిమా మాదిరిగానే..
ప్రియుడిని పెళ్లాడేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి.. వారంరోజుల తర్వాత మరో వ్యక్తిని పెళ్లాడి ఇంటికి చేరుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడిని పెళ్లాడేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి.. వారంరోజుల తర్వాత మరో వ్యక్తిని పెళ్లాడి ఇంటికి చేరుకుంది. అచ్చం జబ్ వీ మెట్ సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రద్ధ పోలీసులకు చెప్పిన వివరాలు 18 ఏళ్ల క్రితం కరీనా కపూర్ - షాహిద్ కపూర్ జంటగా వచ్చిన జబ్ వీ మెట్ సినిమాను గుర్తుచేసింది.
తొలుత తన ప్రియుడు సార్థక్ ను పెళ్లి చేసుకునేందుకు శ్రద్ధ ఇంటి నుంచి పారిపోయింది. రైల్వేస్టేషన్లో వేచి ఉన్న తనకు ప్రియుడు ఫోన్ చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో షాకైంది. తీవ్ర మనోవేదనకు గురైన శ్రద్ధ.. ఇంటికి తిరిగి వెళ్లలేక అక్కడున్న ట్రైన్ ఎక్కింది. రత్లామ్ స్టేషన్లో దిగిన ఆమె.. కరణ్ దీప్ అనే వ్యక్తిని కలిసింది. శ్రద్ధ ఇండోర్ చదివిన కాలేజీలో అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేశాడు. ఏం జరిగిందని అడగ్గా.. ఇదీ విషయమని వివరించింది శ్రద్ధ. ఇంటికి తిరిగి వెళ్లాలని సూచించగా.. ఇప్పుడు తాను తిరిగి వెళ్తే బ్రతకనివ్వరని చెప్పడంతో.. తాను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. అందుకు శ్రద్ధ ఓకే చెప్పగా మహేశ్వర్ - మండలేశ్వర్ వెళ్లి పెళ్లి చేసుకున్నారు.
అనంతరం మందసౌర్ వచ్చి.. తాను క్షేమంగానే ఉన్నట్లు తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఎంఐజీ పోలీస్ స్టేషన్ కు వచ్చి వాంగ్మూలాన్ని ఇవ్వగా.. తిరిగి వచ్చిన కూతుర్ని చూసి అనిల్ తివారీ ఆనందం వ్యక్తం చేశాడు. కరణ్, శ్రద్ధలను 10 రోజులు వేర్వేరుగా ఉంచుతానని, ఆ తర్వాత కూడా వారిద్దరూ ఇష్టపడితే పెళ్లిని అంగీకరిస్తానని పోలీసుల ఎదుట తెలిపాడు.






