- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దైవం మనుష్య రూపేణ! రోడ్డుపై నిలిచిన నీటిలో కరెంట్ షాక్‌తో బాలుడు.. ఏమైందంటే?
వీధుల్లో (water on the road) రోడ్లపై నిలిచిన వర్షపు నీటిలో కరెంట్ తీగల వద్ద జాగ్రత్తగా ఉండాల్సిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: వీధుల్లో (water on the road) రోడ్లపై నిలిచిన వర్షపు నీటిలో కరెంట్ తీగల వద్ద జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చిపెడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఏప్రిల్ 16న (Chennai) చెన్నైలోని (Arumbakkam) అరంబాక్కంలో స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డు మీద నిలిచిన వర్షపు నీటిలో నడుస్తుండగా కరెంటు తీగ తగిలి ఓ బాలుడు (electric shock) షాక్‌తో నీటిలో పడిపోయాడు. అటువైపు వెళుతున్న వారు ఎవరూ కూడా భయపడి ఆ బాలుడిని రక్షించే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో బైక్ పై వచ్చిన యువకుడు కరెంట్ షాక్ తో నీటిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని ధైర్యంగా రక్షించాడు. మరోవైపు యువకుడు పిల్లవాడికి సీపీఆర్ చేసి.. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో బాలుడు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు.
ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో నెట్టింట వైరల్ అయింది. రక్షించబడిన బాలుడు జాడెన్ ర్యాన్ (9) మూడో తరగతి చదువుతున్నాడు. ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడిన యువకుడు 24 ఏళ్ల కన్నన్‌కు తమిళనాడు వ్యాప్తంగా అభినందనలు తెలుపుతున్నారు. దైవం మనుష్య రూపేణ అంటూ సమయానికి దేవుడిలా వచ్చి బాలుడిని రక్షించావని యువకుడిని నెటిజన్లు కొనియాడారు. అసలు సిసలైన హీరో ఇతడే అంటూ మరో నెటిజన్ ఆసక్తికర కామెంట్ చేశారు.






