- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kashish Chaudhary : బలూచిస్తాన్ లో హిందూ యువతికి కీలక పదవి.. జయహో అంటున్న నెటిజన్స్
బలూచిస్తాన్(Balochistan)లో 25 ఏళ్ల హిందూ యువతి కషిష్ చౌదరి(Kashish Chaudhary) అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితురాలై చరిత్ర సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్ : బలూచిస్తాన్(Balochistan)లో 25 ఏళ్ల హిందూ యువతి కషిష్ చౌదరి(Kashish Chaudhary) అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితురాలై చరిత్ర సృష్టించింది. ఈ ప్రాంతంలో హిందూ మైనారిటీ సముదాయం నుంచి ఈ పదవిని అందుకున్న తొలి మహిళగా కషిష్ నిలిచింది. చాగై జిల్లాలోని నోష్కీ(Noshki) పట్టణానికి చెందిన కషిష్.. మూడు సంవత్సరాలు రోజుకు 8 గంటలు కష్టపడి చదివి బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(BPSC) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె తండ్రి గిర్ధారీ లాల్.. మధ్యస్థాయి వ్యాపారి. తన కుమార్తె కృషితో, పట్టుదలతో ఈ స్థానాన్ని సాధించడం గర్వకారణమని చెప్పారు. కషిష్ ఎల్లప్పుడూ చదువుకోవాలని, మహిళల కోసం ఏదైనా చేయాలని కలలు కనేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో కషిష్ తన తండ్రితో కలిసి బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ(Balochistan CM Sarfaraz Bugti)ని క్వెట్టాలో కలిసింది. తాను మహిళల సాధికారత, మైనారిటీల హక్కులు, తమ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తానని వెల్లడించింది. సీఎం బుగ్టీ, కషిష్‌ను "బలూచిస్తాన్ దేశానికి కషిష్ గర్వకారణం" అని ప్రశంసిస్తూ.. మైనారిటీలు కృషితో ఉన్నత స్థానాలు సాధించడం గొప్ప విషయంగా కొనియాడారు. ముస్లిం దేశంలో, అందునా అడుగడుగునా పురుషాధిక్యం గల ప్రాంతంలో ఉన్నత పదవిని పొందడంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయహో కషిష్ అంటూ జేజేలు పలుకుతున్నారు.






