కాలేజీకి వెళ్తున్న యువతి కిడ్నాప్.. గ్యాంగ్ రేప్

by Muthe.Rajitha |

రాజస్థాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

కాలేజీకి వెళ్తున్న యువతి కిడ్నాప్.. గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్తున్న యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకొని గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. బికనీర్ జిల్లాలో నాపసర్ ప్రాంతంలో ఇంటి నుంచి కాలేజీకి వెళ్తున్న యువతిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి... కొన్ని గంటల పాటు కదులుతున్న కారులో ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత కారు ఒక గ్రామంలోకి వెళ్లగా స్థానికులకు అనుమానం వచ్చి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. నిందితులు యువతిని కారులో నుంచి బయటకు తోసేసి అక్కడి నుంచి పారిపోయారు. గ్రామస్థులు వెంటనే బాధితురాలి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Next Story