- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడిరోడ్డుపై చీర విప్పి ఐదుగురి ప్రాణాలు కాపాడిన మహిళ
by Chukka Sudharani |
ఎదుటి వ్యక్తి ప్రాణాలు పోతున్నాయంటే మనకేంటి సంబంధం అన్నట్లు వెళ్లిపోతుంది నేటి సమాజం.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎదుటి వ్యక్తి ప్రాణాలు పోతున్నాయంటే మనకేంటి సంబంధం అన్నట్లు వెళ్లిపోతుంది నేటి సమాజం. లేదా.. వారు ఎలా చనిపోతున్నారా అని ఫోన్‌లలో వీడియోలు తీస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం నడి రోడ్డుపై తన చీరను విప్పి మరీ ఐదుగురి ప్రాణాలను కాపాడింది. వివరాల్లోకి వెళితే..
బెంగళూరు-KR కూడలిలోని అండర్ పాస్ వద్ద భారీ వరదలో కారులో చిక్కుకున్న ఐదుగురి ప్రాణాలను ఓ మహిళ తన చీరతో కాపాడారు. నీటిలో చిక్కుకున్న ఆరుగురిని కాపాడేందుకు, వారిని బయటకు లాగేందుకు తాడు కావాల్సి వచ్చింది. చుట్టూ చాలా మంది ఉన్న ఎవరూ స్పందించలేదు. దీంతో మహిళ తన చీరను విప్పి వరదలో చిక్కుకున్న వారికి ఇచ్చింది. ఆ చీరను ఇనుప ఊచలకు కట్టి వారిని కాపాడింది. అయితే ఆరుగురిలో అప్పటికే ఏపీకి చెందిన భానురేఖ అనే యువతి మృతి చెందింది.
Next Story






