- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్లారితే పెళ్లి.. వరకట్నం కేసుతో వరుడిని ఇరికించిన వధువు.. కానీ అడ్డంగా దొరికిపోయింది..
తెల్లారితే పెళ్లి.. కానీ పెళ్లి కూతురు యూటర్న్ తీసుకుంది. పెళ్లి కొడుకుపై వరకట్నం కేసు పెట్టింది. భారీ మొత్తంలో వరకట్నం తీసుకున్నాడని కేసు పెట్టింది. అయితే ఈ విషయంలో వరుడు ఆశ్చర్యపోలేదు.

దిశ, వెబ్ డెస్క్: తెల్లారితే పెళ్లి.. కానీ పెళ్లి కూతురు యూటర్న్ తీసుకుంది. పెళ్లి కొడుకుపై వరకట్నం కేసు పెట్టింది. భారీ మొత్తంలో వరకట్నం తీసుకున్నాడని కేసు పెట్టింది. అయితే ఈ విషయంలో వరుడు ఆశ్చర్యపోలేదు. ఇదంతా ముందే ఊహించిన వరుడు.. అసలు కేసు పెట్టేందుకు గల కారణాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాడు. అబ్బాయి నుంచి పది లక్షలు డిమాండ్ చేసింది అమ్మాయి. దీనికి అతను తిరస్కరించడంతో.. ఈ స్టోరీ అల్లేసింది. భారతదేశ వరకట్న చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కేసు పెట్టింది.
కానీ వరుడు కాల్‌ను రికార్డ్ చేయడం.. వాట్సాప్ చాట్స్‌ను సేవ్ చేసుకోవడంతో కీలకమైన సాక్ష్యాలుగా పనిచేశాయి. ఫాల్స్ కేసు నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఇచ్చాయి. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. బ్రదర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో వర్గం వారు మాత్రం చాటుగా తీసుకున్న వరకట్నంకు సంబంధించిన వీడియోలు లేవు కాబట్టి దొంగ దొర అయిపోయాడని విమర్శిస్తున్నారు.






