- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pahalgam Attack: హనీమూన్ కోసం తొలుత యూరప్ కు ప్లాన్ చేసి కశ్మీర్ కు.. పహెల్గం ఉగ్రదాడిలో నేవీ ఆఫీసర్ విషాద గాథ
పహెల్గం ఉగ్రదాడిలో పెళ్లైన వారానికే నేవీ ఆఫీసర్ మృతి చెందడం అందరిని కలచివేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకశ్మీర్ పహెల్గం (Pahalgam Attack) ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాల రోధనలు మిన్నంటాయి. ఈ ఘటనలో మృతులలో ఒక్కొక్కరి గాథా అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఎంత ప్రాధేయపడినా వదలకుండా పాయింట్ బ్లాంక్ లో మతం పేరు అడిగిమరీ హంతమొందించిన తీరును తలచుకుంటూ వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఈ ఎటాక్ లో పెళ్లైన వారం రోజులకే ప్రాణాలు కోల్పోయిన హర్యానాకు చెందిన నేవీ ఆఫిసర్ వినయ్ నార్వాల్ (Navy officer Vinay Narwal) విషాదం అందరి గుండెల్ని పిండేస్తోంది.
యూరప్ వెళ్లాలనుకుని..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వినయ్ మూడేళ్ల క్రితం నేవీలో లెఫ్టినెంట్‌గా చేరాడు. ప్రస్తుతం అతడు కేరళలోని కొచ్చిలో పని చేస్తున్నాడు. ఆరు రోజుల క్రితం వివాహం చేసుకున్న వినయ్ తన హనీమూన్ కోసం తొలుత యూరప్ ట్రిప్ కు వెళ్లాలని బావించారు. కానీ వారికి చివరి క్షణంలో వీసా దొరకలేదు. దీంతో తమ ప్లాన్ మార్చుకుని జమ్మూకశ్మీర్ కు వచ్చారు. తన భార్య హిమాన్షి తో కశ్మీర్ లో ఆనందంగా గడిపిన వినయ్ అంతలోనే ఇలా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచివేసింది. వారికి యూరప్ వీసా దొరికి ఉంటే ఈ ప్రమాదం నుంచి తప్పేది కదా అని వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.






